మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని సోమవారం చిత్ర నిర్మాత మోహన్‌బాబు అధికారికంగా వెల్లడించారు. భక్త కన్నప్ప వృత్తాంతం ఆధారంగా భక్తిరస ప్రధానంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, ప్రభాస్, శరత్‌కుమార్, మధుబాల, బ్రహ్మానందం వంటి అగ్ర తారలు ఇందులో భాగమవుతున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం దేశవ్యాప్తంగా ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకునే పనిలో ఉంది. సినిమా విడుదలయ్యేలోపు పన్నెండు జ్యోతిర్లింగాలను సందర్శిస్తామని మంచు విష్ణు తెలిపారు. సోమవారం ఉజ్జయినీ మహాకాళేశ్వర్ దేవాలయంలో ‘కన్నప్ప’ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందించామని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని చిత్ర బృందం పేర్కొంది.