Mark Antony First Look Poster | విశాల్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఇక్కడ కూడా ఈయన సినిమాలకు టాలీవుడ్ టైర్2 హీరో రేంజ్లో కలెక్షన్లు వస్తుంటాయి. అయితే గత కొంత కాలంగా విశాల్ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. 2018లో వచ్చిన అభిమన్యుడు తర్వాత ఇప్పటివరకు ఈయనకు మరో హిట్టు లేదు. ప్రస్తుతం విశాల్ మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో మార్క్ ఆంటోని ఒకటి. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. కాగా సోమవారం విశాల్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన విశాల్ ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పోస్టర్లో విశాల్ గుబురు గడ్డంతో ఆగ్రహంతో ఊగిపోతూ ఫైరింగ్ చేస్తున్నాడు. పోస్టర్‌ను చూస్తుంటే ఈ చిత్రంలో విశాల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. మినీ స్టూడీయోస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై ఎస్. వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీ.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో విశాల్‌కు జోడీగా రీతూవర్మ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మేకర్స్ రూపొందించనున్నారు.
First Look of #MarkAntony 😎#HBDVishal
Happy Birthday! #PuratchiThalapathy @VishalKOfficial 🥳🌟 pic.twitter.com/nsPGOdB9a9— Maduri Mattaiah (@madurimadhu1) August 29, 2022