విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మకుటం’. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 99వ చిత్రమిది. ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. దుషార విజయన్, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. బుధవారం ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో విశాల్ మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. యంగ్, మిడిల్ ఏజ్, ఓల్డెజ్ లుక్‌తో ఈ పోస్టర్ కథపై ఆసక్తినిరేకెత్తించేలా ఉంది. సముద్ర మాఫియా నేపథ్యంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, దర్శకత్వం: రవి అరసు.