తమిళ అగ్ర హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మకుటం’. ప్రతిష్టాత్మక సూపర్‌గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ఆ సంస్థ నుంచి వస్తున్న 99వ సినిమా కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు సంచలనంగా మారాయని చిత్రబృందం చెబుతున్నది.
ఈ సందర్భంగా ఈ సినిమా అప్డేట్ని మేకర్స్ వెల్లడించారు. 17రోజులు నిర్విరామంగా జరిగిన షూట్‌తో ఈ సినిమా క్లైమాక్స్ పూర్తయిందని, వందలాదిమంది స్టంట్ కళాకారులు ఈ షూట్లో పాల్గొన్నారని, నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్ అనేలా ఈ క్లైమాక్స్ వచ్చిందని, ఓవైపు దర్శకునిగా, మరోవైపు నటుడిగా విశాల్ విశ్వరూపం చూపిస్తున్నారని మేకర్స్ తెలిపారు. దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, ఐర్జె తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: రవి అరసు, కెమెరా: రిచర్డ్ ఎం.నాథన్, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్.