Virupaksha Movie Record | కంటెంట్‌తో వస్తే కలెక్షన్లకు అడ్డేది అని మరోసారి ‘విరూపాక్ష’ నిరూపించింది. వారం రోజుల క్రితం విడుదలైన విరూపాక్ష బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది. రోజు రోజుకు కలెక్షన్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. థియేటర్లలో టిక్కెట్లు భారీ స్థాయిలో తెగుతూనే ఉన్నాయి. పైగా ఏజెంట్‌కు కూడా డివైడ్ టాక్ రావడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు విరూపాక్ష ఒక్కటే ఆప్షన్ అయింది. ఇక పొన్నియన్ సెల్వన్-2ను ఒక వర్గానికి చెందిన ప్రేక్షకులు మాత్రమే ఇష్టపడుతుంటారు. దాంతో ఇది పోటీ అని లెక్కగట్టలేం. ఈ లెక్కన చూసుకుంటే విరూపాక్షకు మరో వారం వరకు బ్రేకులు లేనట్లే.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రూ.70 కోట్ల కలెక్షన్లు సాధించింది. సాయితేజ్ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా విరూపాక్ష నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమా సాయితేజ్ మార్కెట్‌ను కూడా పెంచింది. ఇదే జోరు కొనసాగితే ఫైనల్ రన్లో మరో పది, పదిహేను కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు కార్తిక్ దండూ దర్శకత్వం వహించాడు. తొలి సినిమాకే ఈ రేంజ్లో అవుట్ పుట్ ఇచ్చాడంటే మాములు విషయం కాదు. ఇక హీరోయిన్ సంయుక్తకు కూడా ఈ సినిమాతో తిరుగులేని పాపులారిటీ వచ్చింది. ఇక వచ్చే వారం ఈ సినిమాను తమిళంలో రిలీజ్ చేయబోతున్నారు.