Virosh | ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ-రష్మిక మంధాన జంట మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. పెళ్లికి పిలవలేదని అలిగిన ఓ చిన్నారి కోరికను ప్రేమతో తీర్చుతూ ఈ స్టార్ జంట అందరి ప్రశంసలు అందుకుంటోంది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా దేశవ్యాప్తంగా స్వీట్లు పంచిపెట్టడం, అన్నదానాలు నిర్వహించడం, సినీ–రాజకీయ ప్రముఖులతో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో ఈ జంట వార్తల్లో నిలిచింది. అయితే “మమ్మల్ని కూడా పెళ్లికి పిలవొచ్చు కదా!” అంటూ ఓ చిన్నారి సోషల్ మీడియాలో క్యూట్ వీడియో పోస్ట్ చేసింది. తాను కూడా ఫ్యానేనని, రీల్స్ చేస్తానని చెప్పుకుంటూ అలక చూపిన ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది.
ఈ వీడియో చూసిన విజయ్ దేవరకొండ వెంటనే స్పందిస్తూ, “బుజ్జి తల్లీ… నిన్ను ఇంటికి లంచ్‌కు పిలుస్తా. నీకు ఇష్టమైన ఫుడ్, స్వీట్స్ చెప్పు… అన్నీ కలిసి తిందాం” అంటూ హామీ ఇచ్చారు. మాట ఇచ్చినట్టుగానే ఆ చిన్నారిని ఇంటికి ఆహ్వానించారు.ఆమెకు ఇష్టమైన లడ్డూ, పులిహోర వంటి వంటకాలు ప్రత్యేకంగా తయారు చేయించి, విజయ్ – రష్మిక స్వయంగా ప్రేమతో వడ్డించారు. చిన్నారిని ఎత్తుకుని ఆడిస్తూ, సరదాగా గడిపారు. “ఇప్పుడు లడ్డూలు తిన్నావ్ కదా… ఇక మనం ఫ్రెండ్సేనా?” అని విజయ్ అడగగా, ఆ పాప ఆనందంగా “అవును” అని సమాధానమిచ్చింది.
ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నారి మనసును గెలుచుకున్న ఈ జంటపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యాన్స్‌తో ఇలాంటి అనుబంధం కొనసాగించడం నిజమైన స్టార్‌డమ్‌కి నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ, ఒక చిన్నారి కోరికను గౌరవించి ఆమెను ప్రత్యేకంగా ఫీల్ చేయించిన విజయ్ – రష్మిక మంచితనాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. “ఇదే నిజమైన స్టార్డమ్”, “ఫ్యాన్స్‌కి ఇంత విలువ ఇస్తేనే వాళ్లు హృదయాల్లో ఉంటారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీలు తమ ఫ్యాన్స్‌తో ఇలాంటి అనుబంధాన్ని కొనసాగించడం అరుదు. కానీ ఈ ఘటనతో విజయ్, రష్మిక మరోసారి అందరి మనసులు గెలుచుకున్నారు.