Naga bandham | విష్ణు ఆలయ రహస్యాలతో ‘నాగబంధం’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Naga bandham | యువ నటుడు విరాట్ కర్ణ, గ్లామరస్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటిస్తున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘నాగబంధం’ ట్రైలర్‌ను చిత్ర బృందం ఘనంగా విడుదల చేసింది.
Naga bandham | యువ నటుడు విరాట్ కర్ణ, గ్లామరస్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటిస్తున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘నాగబంధం’ ట్రైలర్‌ను చిత్ర బృందం ఘనంగా విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ పిసిఎక్స్ థియేటర్లో యూనిట్ సభ్యుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అభిషేక్ పిక్చర్స్, ఎన్ఐకే స్టూడియోస్ పతాకాలపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఈ సినిమాతో దర్శకుడిగా మారారు.
ట్రైలర్లో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ తెలుగు సాంకేతిక నిపుణులే రూపొందించడం విశేషం. పురాతన ఆలయాలు, గ్రాఫిక్స్ విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మన పురాతన విష్ణు ఆలయాలు, వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలు, సనాతన ధర్మం మరియు చారిత్రక అంశాల నేపథ్యంలో మైథాలజీ అడ్వెంచర్ స్పెక్టకిల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో విరాట్ కర్ణ శివ తరహా మాస్ లుక్‌లో కనిపించనుండగా, చాలా రోజుల తర్వాత నభా నటేష్ పవర్ఫుల్ పాత్రలో మెరవబోతోంది. వీరితో పాటు ఐశ్వర్యా మీనన్, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జునైద్ కుమార్ మరియు అబీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు భారీ హైప్ తీసుకొచ్చింది.
విజువల్‌గా, సాంకేతికంగా ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని, ప్రతి రూపాయి తెరపై స్పష్టంగా కనిపిస్తుందని దర్శకుడు అభిషేక్ నామా తెలిపారు. మన పురాతన ఆలయాలు, వాటి వెనుక ఉన్న చరిత్రను తర్వాత తరాలకు తెలియజేసేలా ఈ సినిమా ఉంటుందని హీరో విరాట్ కర్ణ చెప్పారు. ‘నాగబంధం’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ భాషల్లో జూలై 03న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

