Viral Video | ఒకప్పుడు మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ ఇమిడి ఉండేది. కాని ఇప్పుడు రెండు ఫ్యామిలీలు వేరు వేరు అని, అల్లు అర్జున్ మెగా హీరోగా కాకుండా అల్లు హీరోగానే చెప్పుకుంటున్నాడని ప్రచారాలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా అల్లు వర్సెస్ మెగా రచ్చ గురించి నెట్టింట జోరుగా చర్చ నడుస్తూ ఉంది. ఏ చిన్న ఛాన్స్ దొరికిన సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని దానికి సాక్షం ఫలానా అంటూ ఏవో ఫొటోలు, వీడియోలు చూపిస్తూ ఉంటారు. అయితే తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో అటు కొణిదెల, ఇటు అల్లు ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తుంది.
మెగాస్టార్ రీఎంట్రీ తర్వాత బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 సంక్రాంతికి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడంతో పాటు ఫ్యాన్స్‌ని ఎంతగానో అలరించింది. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప, పుష్ప2 చిత్రాలతో తన క్రేజ్‌ని మరింత పెంచుకున్నాడు. బన్నీ క్రేజ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరింది. అయితే ఓ నెటిజన్ ఇప్పుడు వాల్తేరు వీరయ్య, పుష్ప రాజ్ పాత్రలను కలిపి క్రాస్ ఓవర్ వీడియో మాదిరిగా ఎడిట్ చేసాడు. ఈ వీడియో ఇప్పడు నెట్టింట వైరల్ అవుతుంది.
‘వాల్తేరు వీరయ్య’, ‘పుష్ప 2’ సినిమాలలోని కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ఈ వీడియో రూపొందించారు. ‘పుష్ప 2’ ఇంట్రడక్షన్ సన్నివేశంలో జపాన్ హార్బర్ లో అల్లు అర్జున్ ను వేలాడదీస్తారు. అక్కడికి వచ్చిన చిరంజీవి ”వాల్తేరు వీరయ్యని నేనే.. మీరు వెతుకుతున్న గ్యాంగ్ లీడర్ ని నేనే.. మీ కథలోకి నేను రాలేదు. నా కథలోకే మీరందరూ వచ్చారు. నేను ఇక్కడికి అడుగెట్టిందే వీడి కోసం” అని డైలాగ్ చెబుతారు. సీఎం అవ్వడానికి 100 కోట్ల దాకా ఖర్చు అవుతుందని బన్నీతో రావు రమేష్ చెప్పే సన్నివేశంలోకి చిరు వచ్చినట్టుగా క్రియేట్ చేశారు. ఫోటో తీయమని అల్లు అర్జున్ అంటే.. ఒక్క నిమిషం ఉండమని చిరంజీవి కళ్లద్దాలు పెట్టుకోవడం బాగా సింక్ అయింది.ఇక పుష్ప-2 ఇంటర్వెల్ సీన్ లో షెకావత్ కి పుష్పరాజ్ సారీ చెప్పడానికి రెడీ అవుతుండగా.. మధ్యలోకి వచ్చిన వీరయ్య తెలుగులో నాకు నచ్చని పదం అంటూ డైలాగ్ చెబుతాడు. ఇలా సరదాగా వాల్తేరు వీరయ్య, పుష్ప రాజ్ పాత్రలతో ఎడిట్ చేసిన వీడియో ఫ్యాన్స్‌ని ఎంతగానో అలరిస్తుంది.
Idhi Ela miss ayyam raa Inni rojulu ❤️🔥🙏#Chiranjeevi #AlluArjun ❤️❤️ pic.twitter.com/ZkpsOyeQcD
— p r /\ s h /\ n t h (@AlluPrashan) March 30, 2025