Viral Photo | మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ కథ ఇండస్ట్రీలో ఎంత హాట్ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఆ తర్వాత పెద్దలని ఒప్పించి , 2023లో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్నారు. అప్పటి నుంచి సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితాన్నీ బ్యాలెన్స్ చేస్తూ, హ్యాపీగా ముందుకు సాగుతున్నారు.ఈ ఏడాది మేలో లావణ్య త్రిపాఠి తన ప్రెగ్నెన్సీ వార్తను అధికారికంగా షేర్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఎక్కువగా పబ్లిక్‌గా కనిపించలేదు.
అయితే, వినాయక చవితిని పురస్కరించుకుని, వరుణ్–లావణ్య దంపతులు ఇంట్లో గణేశుని పూజ నిర్వహించి, కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలో లావణ్య బేబీ బంప్‌తో మెరిసిపోతూ కనిపించారు. లావణ్య త్రిపాఠి గ్లామరస్ లుక్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఎంతో అందంగా, ఆనందంగా కనిపిస్తున్న ఈ జంట ఫొటో వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వరుణ్–లావణ్య త్వరలోనే తల్లితండ్రులు కాబోతున్నారు. ఈ క్యూట్ కపుల్ జీవితంలోకి మరో వ్యక్తి రాబోతున్నారు. ఈ మధుర క్షణాల్లో లావణ్యను ఇలా బేబీ బంప్‌తో చూడడం ఫ్యాన్స్‌కి ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చింది.
వరుణ్ తేజ్ కొన్నేళ్లుగా మంచి సక్సెస్ లు అందుకోలేకపోతున్నారు. వైవిధ్యమైన సినిమాలు ట్రై చేస్తున్న వరుణ్ వరుస ఫ్లాపులని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. మరో వైపు లావణ్య త్రిపాఠి గతంలో మాదిరిగా సినిమాలు చేయడం లేదు. ఏదో అడపాదడపా అలా మెరిసి ఇలా పోతుంది.