Maha Kumbh Viral Girl Monalisa | ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుని వైరల్ అయిన మోనాలిసా అనే అమ్మాయి ఆమె అమ్మకి బంగారు గొలుసు గిప్ట్గా ఇచ్చింది. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోవడానికి ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వచ్చింది మోనాలిసా. అయితే తన తేనె కళ్లు, అందం, చిరునవ్వుతో అందరిని ఆకర్షించింది. దీంతో ఆమె ఫొటోను ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పెట్టాడు. అది కాస్తా రాత్రికి రాత్రే వైరల్‌గా మారడంతో సెలబ్రీటిగా మారింది మోనాలిసా. దీంతో ఆమెతో ఫొటో దిగేందుకు కుంభమేళాకు వచ్చిన ప్రజలు ఎగబడ్డారు. అయితే తన వలన కుంభమేళా ప్రతిష్ట దెబ్బతినోద్దని తన వ్యాపారం వదిలేసి తన గ్రామంకి వెళ్లిపోయింది మోనాలిసా.. అయితే మోనాలిసాకి జరిగిన అన్యాయం తెలుసుకున్న నెటిజన్లు ఆమెకి సపోర్ట్‌గా నిలిచారు. ఈ క్రమంలోనే ఒక బాలీవుడ్ దర్శకుడు కూడా ఆమెకి సినిమా ఛాన్స్ ఇచ్చాడు.
మణిపూర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను కథానాయికగా ఎంపిక చేసుకున్నాడు. ఇక ఈ సినిమాకు పారితోషికంగా రూ.21 లక్షలు అందుకున్నట్లు సమాచారం. అయితే మొదటి సినిమాకు పారితోషికం తీసుకున్న అనంతరం మోనాలిసా అన అమ్మకి బంగారు గొలుసు కొనిపెట్టింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా తెలుపుతూ చూడండి అమ్మకి ఏం కొనిచ్చానో అంటూ వీడియో పెట్టింది.