వినోద్‌వర్మ, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అరి’. జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశానని, మనల్ని మనం చూసుకునే అద్దంలాంటి చిత్రమిదని దర్శకుడు తెలిపారు.
తన 50ఏళ్ల నటజీవితంలో ఇలాంటి గొప్ప చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నానని సీనియర్ నటుడు సాయికుమార్ పేర్కొన్నారు. అరిషడ్వర్గాల నేపథ్యానికి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని రూపొందించామని, ఎంతోమంది పెద్దలు ఈ చిత్రాన్ని ప్రశంసించారని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌రూబెన్స్, నిర్మాతలు: శ్రీనివాస్ రామిరెడ్డి, శేషురెడ్డి, తిమ్మప్ప నాయుడు, బీరం సుధాకర్ రెడ్డి, రచన-దర్శకత్వం: జయశంకర్.