Vinaro Bhagyamu Vishnukatha Movie | టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫలితం ఎలా ఉన్నా వరుసగా సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. కెరీర్ మొదట్లో వరుస హిట్లతో మంచి స్పీడ్ చూపించిన కిరణ్.. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. గత రెండేళ్ళుగా హిట్టుకు దూరమయ్యాడు. కాగా గతేడాది కిరణ్ ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేస్తే అందులో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రస్తుతం కిరణ్ ఆశలన్నీ ‘వినరో భాగ్యము విష్ణుకథా’ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై కాస్త బజ్ క్రియేట్ చేశాయి. కాగా తాజాగా ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది.
ఈ సినిమాను ముందుగా ఫిబ్రవరి 17న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. కానీ తాజాగా ఈ సినిమాను ఒకరోజు పోస్ట్‌పోన్ చేస్తూ ఫిబ్రవరి 18న వస్తున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా 17న ధనుష్ సార్ మూవీ రిలీజ్ కానుంది. సూర్యవంశీ కోరిక మేరకు బన్నీ వాసు ఒకరోజు తన సినిమాను పోస్ట్ పోన్ చేశాడట. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. కాగా ఈ మధ్య ఈ సంస్థ నుండి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. మరీ ఈ సినిమా అయినా కిరణ్ వైఫల్యాలకు బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి.