కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), కశ్మీర పరదేశి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). ఈ సినిమా నుంచి రెండో సాంగ్ అప్డేట్ అందించారు మేకర్స్. ఓ బంగారం సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. భాస్కరభట్ల రాసిన ఈ పాటను చేతన్ భరద్వాజ్ కంపోజిషన్‌లో కపిల్ కపిలన్ పాడారు.
హీరోహీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్ నేపథ్యంలో ఫీల్ గుడ్‌గా ఈ పాట ఉండబోతున్నట్టు ప్రోమోతో తెలిసిపోతుంది. జనవరి 19న సాయంత్రం 5:04 గంటలకు ఓ బంగారం ఫుల్ సాంగ్ లాంఛ్ చేయనున్నారు. చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ఫస్ట్ సింగిల్ వాసవ సుహాస సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది.
వినరో భాగ్యము విష్ణుకథ చిత్రానికి కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో కశ్మీర పరదేశి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. మురళీ శర్మ, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఓ బంగారం సాంగ్ ప్రోమో..
వినరో భాగ్యము విష్ణుకథ టీజర్..
వాసవ సుహాస సాంగ్ ప్రోమో..
వినరో భాగ్యము విష్ణుకథ టీజర్..