‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) అంటూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇప్పటికే విడుదలైన టీజర్, వాసవ సుహాస సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం నేడు రెండో పాట ఓ బంగారం ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ లాంఛ్ చేశారు.
‘ఓ బంగారం నీ చెయ్యే తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం..నా బంగారం కన్నెత్తి చూడగానే నిద్దర్లే మానేసి జాగారం’ అంటూ కిరణ్ అబ్బవరం హీరోయిన్ను ఫాలో అవుతూ పాడుకుంటున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తూ సాగుతోంది. సిల్వర్ స్క్రీన్‌పై కిరణ్ అబ్బవరం, కశ్మీర్ పరదేశి కెమెస్ట్రీని మూవీ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేయడం ఖాయమని సాంగ్ విజువల్స్ తో అర్థమవుతుంది.
భాస్కరభట్ల రాసిన ఈ పాటను కపిల్ కపిలన్ పాడాడు. చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేశాడు. కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్న వినరో భాగ్యము విష్ణుకథ ఫిబ్రవరి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కశ్మీర పరదేశి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్నారు.
మురళీ శర్మ, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మురళీ శర్మ క్యారెక్టర్ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ అందించనున్నట్టు టీజర్‌తో తెలిసిపోతుంది.
ఓ బంగారం లిరికల్ వీడియో సాంగ్
Here's the lilting love melody of the season ~ #OhBangaram ❤️#VinaroBhagyamuVishnuKatha 2nd Single Out Now 🎧
▶️ https://t.co/tQzKowZZUc🎹 @chaitanmusic
🎤 @KapilKapilan_
🖋️ @bhaskarabhatla#AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @kashmira_9 @KishoreAbburu @adityamusic pic.twitter.com/V4T9GCTLpw— Geetha Arts (@GeethaArts) January 19, 2023
Innovative Promotions by team #VinaroBhagyamuVishnuKatha ✨
2nd Single #OhBangaram launched today by Man of the Match of #VBVK vs #VVIT College Guntur Cricket Match 🏏
▶️ https://t.co/LFUrm4dhAo #AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @kashmira_9 @KishoreAbburu @chaitanmusic pic.twitter.com/ejHTQxieZB
— BA Raju's Team (@baraju_SuperHit) January 19, 2023
వినరో భాగ్యము విష్ణుకథ టీజర్..
వాసవ సుహాస సాంగ్ ప్రోమో..
వినరో భాగ్యము విష్ణుకథ టీజర్..