Vinaro Bhagyamu Vihsnu katha Movie | హిట్లు, ప్లాప్‌లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. రాజావారు, ఎస్.ఆర్ కళ్యాణ మండపం వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి దూకుడు చూపించిన కిరణ్.. ఆ తర్వాత వరుస ఫేయిల్యూర్‌తో కాస్త స్లో అయ్యాడు. ఫలితం ఎలా ఉన్నా ఆయన మాత్రం వరుసగా సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో వినరో భాగ్యము విష్ణు కథ ఒకటి. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.
చిత్రయూనిట్ ఇప్పటి నుండి ప్రమోషన్లు ప్రారంభించింది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ అప్డేట్ ప్రకటించింది. వాసవ సుహాస అంటూ సాగే డివోషనల్ సాంగ్‌ను డిసెంబర్ 24న రిలీజ్చేయనున్నట్లు ప్రకటించారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో కిరణ్‌కు జోడీగా కశ్మీరా పరదేశి హీరోయిన్గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్స్ట్-2 బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డానియెల్ విశ్వాస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.
Chiru moviki jarigina chirunavvula prasana ❤️
Vasavasuhasa lyrical from Dec 24th 6:19pm
Worldwide release on 17th feb 2023 .@GeethaArts @adityamusic #Vbvk #VinaroBhagyamuVishnuKatha pic.twitter.com/YQUTXsvdjs
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) December 19, 2022