Spark | విక్రాంత్ (Vikrant) హీరోగా నటిస్తోన్న చిత్రం స్పార్క్ (Spark). మెహరీన్ కౌర్ ఫిర్జాదా (Mehreen Pirzada). రుక్సార్ ధిల్లాన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అరవింద్ కుమార్ రవివర్మ ఈ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ YemaAndham అప్డేట్ అందించారు. విక్రాంత్, రుక్సాన్ ధిల్లాన్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సాంగ్‌ను సెప్టెంబర్ 13న లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ సాంగ్ లుక్ విడుదల చేశారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ మెలోడీ సాంగ్‌ను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడాడు. ఖుషి చిత్రానికి సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన మలయాళ కంపోజర్ హేశమ్ అబ్ధుల్ వహబ్ స్పార్క్‌కు సంగీతం అందిస్తున్నాడు. మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేసేలా పాట ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో తెలిసిపోతుంది.
యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో నాజర్, వెన్నెల కిశోర్, షాయాజీ షిండే, సుహాసినీ మణిరత్నం, శ్రీకాంత్, కిరణ్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పార్క్‌లో గురు సోమసుందరం విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి డైరెక్టర్ అరవింద్ కుమార్ రవివర్మ సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేస్తుండటం విశేషం. స్పార్క్ డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది.
YemaAndham సాంగ్ లుక్..
A melodious treat awaits for you all! ❤️#SPARKTheLife ~ 1st single #YemaAndham will be out on Sept 13th! 🤩
A @HeshamAWMusic Musical 🎹
Lyrics by #AnanthSriram
Vocals – @sidsriram 🎤@ThisIsVikranth @RuksharDhillon @Deaffrog_Prod @adityamusic pic.twitter.com/EmBmiBZOSJ— BA Raju’s Team (@baraju_SuperHit) September 11, 2023
సాంగ్ షూట్ లొకేషన్ స్టిల్స్ వైరల్..
#SPARK Movie team has wrapped up a Beautiful song shoot in picturesque locales of Iceland ❤️🔥
Next scheduled will be commenced in the upcoming month! 👍🏻
A @HeshamAWMusic Musical 🎹@ThisIsVikranth @Mehreenpirzada @RuksharDhillon @gurusoms @Aravind6Kumar @deaffrogprod pic.twitter.com/AYDZdRZQdC
— Duddi Sreenu (@PRDuddiSreenu) October 27, 2022