Sri Sri Ravi Shankar | 12 ఫెయిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సీ మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది శ్రీ శ్రీ రవిశంకర్ పాత్రలో విక్రాంత్ మాస్సీ నటించబోతున్నాడు. వైట్ అనే పేరుతో ఈ సినిమా రాబోతుండగా.. పాన్ వరల్డ్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు పఠాన్, వార్, ఫైటర్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, నిర్మాత మహావీర్ జైన్ కలిసి నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కొలంబియా సివిల్ వార్ సమయంలో శ్రీ శ్రీ రవిశంకర్ జోక్యం చేసుకుని హింస లేకుండా సంఘర్షణను పరిష్కరించిన ఒక సంఘటన ఆధారంగా రూపొందుతుంది. ఈ చిత్రం కోసం ఆయన జూలైలో కొలంబియాలో షూటింగ్ ప్రారంభించనున్నారు. దీనిని మార్ఫ్లిక్స్ పిక్చర్స్ మరియు మహావీర్ జైన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మోంటూ బస్సీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో విడుదల కానుంది.