Sector 36 Movie trailer | గతేడాది వచ్చిన 12 ఫెయిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సే (Vikrant Massey) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్గా ఫిర్ అయి హసినా దిల్రుబా అనే సినిమాతో హిట్ అందుకున్న ఈ నటుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం సెక్టర్ 36 (Sector 36). దీపక్ డోబ్రియాల్, దినేష్ విజన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఆదిత్య నింబల్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా ఈ సినిమా విడుదల కానుండగా.. తాజాగా విడుదల తేదీతో పాటు ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. నోయిడాలోని సెక్టార్ 36 ప్రాంతంలో పిల్లలు వరుసగా కిడ్నాప్ అయితుంటారు. అయితే ఆ కిడ్నాప్ చేసేది ఎవరు.. అతడిని పట్టుకోవడానికి పోలీసులు ఏం చేశారు అనేది స్టోరీ. విక్రాంత్ మస్సే ఇందులో పిల్లలను కిడ్నాప్ చేసి చంపే సీరియల్ కిల్లర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా సెప్టెంబర్ 13 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
Also Read..