Chandini Chaudhary | విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకుడు. మధుర ఎంటర్టైన్మెంట్స్, నిర్వి ఆర్ట్స్ పతాకంపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. బుధవారం కథానాయిక చాందిని చౌదరి పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె కల్యాణి ఓరుగంటి అనే పాత్రలో కనిపిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగి తన జీవిత భాగస్వామిగా రావాలని కోరుకునే అమ్మాయిగా ఆమె పాత్ర సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సంతానలేమి అనే సమస్యను వినోదాత్మక కోణంలో ఆవిష్కరించామని, రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్నదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంభాషణలు: కల్యాణ్ రాఘవ్, దర్శకత్వం: సంజీవ్ రెడ్డి.