చియాన్ విక్రమ్ కథానాయకుడిగా ఎస్.యు. అరుణ్‌కుమార్ దర్శకత్వంలో ‘వీర ధీర సూర’ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతున్నది. ఈ సినిమా రెండో భాగం మొదట విడుదల కానుండటం ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఈ నెల 27న రెండో భాగం విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు రైట్స్‌ని ఎన్.వి.ఆర్ సినిమా సొంతం చేసుకోగా, మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ నైజాం విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. కుటుంబంతో కథానాయకుడికి ఉండే అనుబంధాన్ని ఈ టీజర్ ఆవిష్కరించింది. కథలోని ప్రతీకార నేపథ్యాన్ని కూడా టీజర్లో చూడొచ్చు.
విక్రమ్ అద్భుతమైన నటనతో ఈ సినిమాలో ఆకట్టుకుంటారని, ఫ్యామిలీమ్యాన్‌గా, ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే విధివంచితుడిగా విక్రమ్ నటన నెక్ట్స్ లెవల్లో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఎస్.జె.సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషార విజయన్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తేని ఈశ్వర్ ఐఎస్సీ, మ్యూజిక్: జి.వి.ప్రకాష్‌కుమార్, నిర్మాత: రియా శిబు