తమిళ నటుడు విజయ్ ఆంటోని చిత్రాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది. అందుకే ఆయన నటించిన తమిళ చిత్రాలు తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ జాబితాలోనే రాబోతున్న మరో చిత్రం ‘విక్రమ్ రాథోడ్’. బాబు యోగేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ‘తమిళరసన్’ చిత్రానికి తెలుగు అనువాద చిత్రమిది. ఎస్.కౌసల్యరాణి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండగా, మరో నిర్మాత రావూరి వెంకటస్వామి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఎమోషనల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది. ముఖ్యంగా చిత్రంలో వుండే యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా వుంటాయి’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా.