Vikram Movie Actor’s Remuneration | ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘విక్రమ్’ హవానే నడుస్తుంది. సౌత్ నుంచి నార్త్ వరకు కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తుంది. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. లేటెస్ట్‌గానే ఈ చిత్రం రూ. 200 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. కేవలం 5 రోజుల్లోనే విక్రమ్ ఈ ఘనత సాధించిందటే విశేషం అనే చెప్పాలి. ఇదే కంటిన్యూ అయితే 500 కోట్ల క్లబ్లో కూడా అడుగుపెడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈచిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించారు. తమిళ స్టార్ సూర్య కీలకపాత్రలో నటించాడు.
భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయంపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రానికి నటులు, సాంకేతిక నిపుణులు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం. విక్రమ్ సినిమాకోసం కమల్ హాసన్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్‌ను తీసుకున్నాడట. ఇక విజయ్ సేతుపతి రూ.10 కోట్లు, ఫాహద్ ఫాజిల్ రూ.4 కోట్ల పారితోషికం అందుకున్నారట. ఈ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూ.8 కోట్ల వరకు రెమ్యురేషన్‌ను తీసుకోగా.. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ రూ.4 కోట్లు తీసుకున్నాడట. గెస్ట్‌రోల్ చేసిన సూర్య రెమ్యునరేషన్‌ను తీసుకోకుండానే ఈ చిత్రంలో నటించాడట. అయితే కమల్ ఈ చిత్రానికి సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
#Vikram remuneration#KamalHaasan – ₹ 50 cr#VijaySethupathi – ₹ 10 cr#LokeshKanagaraj – ₹ 8 cr#FahadhFaasil – ₹ 4 cr#Anirudh – ₹ 4 cr#Suriya – ZERO
— Manobala Vijayabalan (@ManobalaV) June 8, 2022