Vijayshanthi | ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించింది విజయశాంతి. హీరోల సరసన కాకుండా సోలోగా కూడా నటించి మంచి విజయాలు సాధించింది. లేడి సూపర్ స్టార్‌గా విజయశాంతికి మంచి గుర్తింపు ఉంది. ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోయే విజయశాంతి తర్వాత తర్వాత సినిమాలు తగ్గించారు. ఇటీవల సపోర్టింగ్ రోల్స్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఆ మధ్య సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కనిపించి సందడి చేసిన విజయశాంతి మరికొద్ది రోజుల్లో అర్జున్ S/o వైజయంతి మూవీతో సందడి చేయనున్నారు.
చిత్రంలో విజయశాంతి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. అయితే ఈ మూవీ ఏప్రిల్ 18న విడుదల కానుండగా, ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. విజయశాంతి కూడా పలు ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు తెలియజేస్తుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతి అర్జున్ S/o వైజయంతి మూవీ కోసం 10 కిలోల బరువు తగ్గానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వయస్సులోను సినిమాపై ఆమెకున్న డెడికేషన్ చూసి అందరు నోరెళ్లపెడుతున్నారు.
ముందు ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. నాలుగు నెలల పాటు గ్యాప్ తీసుకొని ఆ లోపు 8 కిలోల వెయిట్ తగ్గాను. షూటింగ్ స్టార్ట్ అయ్యాక మరో 2 కేజీలు తగ్గాను. ప్రత్యేకమైన డైట్ పాటించాను. నాన్‌వెజ్ తినడం పూర్తిగా మానేశాను. రోజు జిమ్ కు వెళ్లి స్పెషల్ వర్కౌట్స్ చేశాను. ఫుడ్ విషయంలో పక్కా రూల్స్ ఫాలో అవడంతో పది కిలోల బరువు తగ్గగలిగాను అని విజయశాంతి పేర్కొంది. అయితే అర్జున్ S/o వైజయంతిలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాను అంటే అందరికీ నా కర్తవ్యం సహ పలు మూవీలు కచ్చితంగా గుర్తొస్తాయి. అప్పటికీ ఇప్పటికీ నా లుక్ కాస్త మారింది కాబట్టి కొందరు కంపేర్ చేస్తారు. అందుకే కాస్త కష్టం అనిపించినా బరువు తగ్గాను అంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు.