రవితేజ బ్లాక్‌బస్టర్ టైటిల్‌తో వస్తున్న విజయ్ సేతుపతి
విజయ్ సేతుపతి ఇప్పుడు తెలుగు మార్కెట్ పై కూడా కన్నేసాడు. ఈయన సినిమాలు ఇక్కడ కూడా బాగానే ఆడుతున్నాయి. పైగా స్ట్రెయిట్ సినిమాలు కూడా చేస్తున్నాడు విజయ్ సేతుపతి.

విజయ్ సేతుపతి ఇప్పుడు తెలుగు మార్కెట్ పై కూడా కన్నేసాడు. ఈయన సినిమాలు ఇక్కడ కూడా బాగానే ఆడుతున్నాయి. పైగా స్ట్రెయిట్ సినిమాలు కూడా చేస్తున్నాడు విజయ్ సేతుపతి. ఉప్పెన, సైరా లాంటి సినిమాలతో తెలుగులో ఈయనకు మార్కెట్ కూడా పెరిగిపోయింది. అందుకే విజయ్ సినిమాలను తెలుగులోనూ అనువదిస్తున్నారు. పైగా ఇప్పుడు థియేటర్స్ లోనే విడుదల చేయాలనే రూల్ ఏం లేదు. నచ్చిన సినిమాలను అనువదించి.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓటిటిలో విడుదల చేసుకునే సౌకర్యం ఉండనే ఉంది. అందుకే అక్కడి సినిమాలను ఇక్కడ విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి నటించిన కొన్ని సినిమాలు ఉప్పెన తర్వాత తెలుగులో విడుదలయ్యాయి.
ఇప్పుడు మరో సినిమాను కూడా విడుదల చేస్తున్నారు. జుంగా పేరుతో అక్కడ విడుదలై డిజాస్టర్ అయిన సినిమాను తెలుగులో విక్రమార్కుడు పేరుతో డబ్ చేస్తున్నారు. రవితేజ ఆల్ టైమ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ టైటిల్ ఇప్పుడు విజయ్ సినిమా కోసం వాడేస్తున్నారు దర్శక నిర్మాతలు. రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమా ఈ మధ్యే 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం అప్పట్లోనే 20 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాంటి టైటిల్ వాడటం అంటే చిన్న విషయం కాదు. కానీ విజయ్ సేతుపతి కోసం ఈ టైటిల్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని ఆహాలో విడుదల చేస్తున్నారు.
సయేషా సైగల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని గోకుల్ తెరకెక్కించాడు. తమిళంలోనే డిజాస్టర్ గా నిలిచిన ఈ చిత్రాన్ని ఇప్పుడు విజయ్ క్రేజ్ వాడుకోవాలని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి అంటూ ఈ మధ్యే ఈయన సినిమా ఒకటి నేరుగా విడుదలైంది. ఇప్పటికే చాలా సినిమాలు విజయ్ సేతుపతి క్రేజ్ చూపించి తెలుగులో అనువదిస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు. అనవసరంగా వచ్చిన ఇమేజ్ పాడు చేయడానికి కాకపోతే ఇలాంటి సినిమాలు ఎందుకు తెలుగులో విడుదల చేస్తున్నారు అంటూ అభిమానులు కూడా అడుగుతున్నారు.
ఇవి కూడా చదవండి..
సిల్వర్ స్క్రీన్ పై మరోసారి ప్రభాస్-కాజల్ సందడి..?
‘డెవిల్’గా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ అదిరింది..వీడియో
తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

