Theri vs Mankatha | తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులైన విజయ్, అజిత్ కుమార్ మధ్య ఎప్పుడూ బాక్సాఫీస్ వార్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్ ఇప్పుడు మరోసారి పతాక స్థాయికి చేరింది. విజయ్ రాజకీయ ఎంట్రీ నేపథ్యంలో వస్తున్న ‘జన నాయకన్’ సినిమా సెన్సార్ వివాదాల కారణంగా విడుదల వాయిదా పడటంతో, అభిమానుల కోసం ఆయన బ్లాక్బస్టర్ హిట్ ‘తేరి’ని రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అయితే దీనికి పోటీగా అజిత్ కుమార్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘మంకత్తా’ చిత్రాన్ని కూడా అదే సమయంలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు సన్ పిక్చర్స్ తాజాగా ప్రకటించింది. దీంతో రెండు సినిమాలు ఒకే సమయంలో వస్తుండటంతో ఈ రెండు చిత్రాల మధ్య బిగ్ ఫైట్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
అట్లీ దర్శకత్వంలో విజయ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించిన ‘తేరి’, వెంకట్ ప్రభు డైరెక్షన్లో అజిత్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో మెప్పించిన ‘మంకత్తా’ చిత్రాలకు తమిళనాడులో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. అయితే జనవరి 23న ఈ రెండు సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నట్లు సమాచారం రావడంతో థియేటర్ల వద్ద మళ్ళీ పాత హంగామా కనిపిస్తోంది. ఒకవైపు విజయ్ లాస్ట్ సినిమాగా భావిస్తున్న ‘జన నాయకన్’ చుట్టూ వివాదాలు నడుస్తుంటే, మరోవైపు అజిత్ ఫ్యాన్స్ తమ హీరో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పోరులో ఎవరి సినిమా బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధిస్తుందో చూడాలి.
Biggest Clash on Jan 23, 2026#TheriReRelease vs #MankathaRerelese pic.twitter.com/afntHPd6QA
— Thariq (@mtsaoffi) January 17, 2026