Vijayanthi Movies | వైజయంతీ మూవీస్ తాజాగా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu)లో శ్రీదేవి చేసిన ఇంద్రజ పాత్ర పోస్టర్ ని పోస్ట్ చేసి ‘మా ఇంద్రజ’ అని క్యాప్షన్ పెట్టింది. ఇటివలే ఈ సినిమాకి సంబధించి సర్వహక్కులు తమవద్ద వున్నాయని పబ్లిక్ నోటీసులు ఇచ్చింది ఆ సంస్థ. దీంతో ఇంద్రజ పాత్ర పరిచయం కూడా అందులో భాగమే అనుకున్నారు చాలా మంది. తర్వాత ‘మా సీత’ అంటూ సీతారామంలో మృణాల్ ఠాకూర్ పోస్టర్ని పోస్ట్ చేశారు. ఈ రెండో పోస్టర్‌తో దీనికి వెనుక అసలు కాన్సెప్ట్ రివిల్ అయ్యింది.
అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజులు శరన్నవరాత్రులు. అమ్మవారు అంటే స్త్రీ శక్తి. వైజయంతి మూవీస్ కూడా తమ చిత్రాలలో బలమైన స్త్రీ పాత్రలు పోషించి కథానాయికలును ఒకొక్కరిగా ఈ పదిరోజులు పది పాత్రలుగా విడుదల చేసే కాన్సప్ట్ని ప్లాన్ చేశారు. మూడో రోజు ఆజాద్ సినిమాలో అంజలిగా సౌందర్య పోస్టర్ని షేర్ చేశారు.
కాగా… వైజయంతి మూవీస్ శరన్నవరాత్రులు కాన్సప్ట్కి నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో ఒక డిమాండ్ కూడా వినిపిస్తుంది. ప్రభాస్ కల్కి 2898 AD నుంచి దీపికా పదుకొనే పోస్టర్ విడుదల చేయమని కోరుతున్నారు ఫ్యాన్స్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ గ్లోబల్ సినిమాగా కల్కి రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నారు. శరన్నవరాత్రులలో ఎదో ఒక రోజు దీపికా కొత్త లుక్‌ని విడుదల చేయాలని కోరుతున్నారు అభిమానులు. మరి వైజయంతి మూవీస్ ఫ్యాన్స్ కోరికని తీరుస్తుందో లేదో చూడాలి.
As pure as she can get,
As innocent as she is,
Our Indraja is synonymous to peace and prosperity,
She remains Eternal!#9Emotions pic.twitter.com/Yrz5jaLSnl— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 16, 2023
To the one who stole our hearts,
Who made us cry,
Who rose to the stars,
And became one!
Our Anjali will remain etched in our hearts forever!
She is “Power”Anjali from #AZAD [#Soundarya]#9Emotions pic.twitter.com/n8pnHq5bd7
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 17, 2023
An epitome of Devotion,
The one who redefined love,
Dedicated and determined,
Our Sita embodies commitment and loyalty – She is “The Love”#9Emotions pic.twitter.com/xIEHhv3gKa— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 16, 2023