Okkadu Movie Remake | సూపర్ స్టార్ దళపతి విజయ్, త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘గిల్లీ’ (Ghilli). టాలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచిన మహేష్ బాబు ‘ఒక్కడు'(Okkadu) సినిమాకు రీమేక్‌గా తమిళంలో ఈ సినిమా వచ్చింది. 2004 ఏప్రిల్17న విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో బ్లాక్ బస్టర్‌గా నిలువడమే కాకుండా విజయ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒక్కటిగా ఈ సినిమా చోటు సంపాదించుకుంది. అయితే ఈ సినిమా విడుదలై 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా విజయ్ అభిమానులు రీ రిలీజ్ ప్లాన్ చేయలని కోరగా.. చిత్రయూనిట్ స్పందించి ఏప్రిల్ 20న తమిళనాడుతో పాటు.. ఓవర్సీస్లోనూ భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు.
అయితే దాదాపు 800 థియేటర్లలో ఈ మూవీని మళ్లీ విడుదల చేయగా.. నిన్న ఒక్కరోజే రూ.10 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. దీంతో తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రీ రిలీజ్ సినిమాతోనే ఈ రేంజ్లో వచ్చాయి అంటే విజయ్ నటిస్తున్న తాజా చిత్రం గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)కు ఏ రేంజ్లో కలెక్షన్లు వస్తాయో అని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు.
ఇక గోట్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రీసెంట్గా సినిమా తేదీని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను సెప్టెంబర్ సెప్టెంబర్ 05న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.