Thalapathy 69 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం దళపతి 68 (Thalapathy 68) The GOAT (GREATEST OF ALL TIME) షూటింగ్‌తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇప్పుడు దళపతి 69 (Thalapathy 69)వ సినిమాకు సంబంధించిన వార్త మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది. విజయ్ ఫుల్ టైం పొలిటీషియన్‌గా మారే ముందు ఇదే చివరి సినిమా కానుంది. కాగా తన కెరీర్లో ఆఖరి సినిమాను పొలిటికల్ టచ్‌తో సాగేలా గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్నట్టు కోలీవుడ్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడుహెచ్ వినోథ్ తెరకెక్కించనున్నాడట. ఈ డెరెక్టర్ కమల్ హాసన్ సినిమా చేయాల్సి ఉండగా.. ప్రస్తుతానికి ఆ సినిమా నిలిచిపోయినట్టేనని సమాచారం. దళపతి 69 ప్రధానమైన అంశాల చుట్టూ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. అంతేకాదు ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబర్ ప్రాజెక్ట్ తెరకెక్కించిన టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుందని సమాచారం. దీనికి సంబంధించి విజయ్ అండ్ ప్రొడ్యూసర్స్ టీం నుంచి అధికారిక ప్రకటన తరువాయి అని తెలుస్తోంది.
ఇప్పటికే విడుదల చేసిన The GOAT టైటిల్ పోస్టర్‌తోపాటు సెకండ్ లుక్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. The GOAT స్టిల్స్‌లో విజయ్ ఓ వైపు ఓల్డ్ మ్యాన్‌గా, మరోవైపు యంగ్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు. డ్యుయల్ షేడ్స్‌లో ఉన్న ఇద్దరూ బుల్లెట్ రైడ్ చేస్తూ.. గన్ ఫైర్ చేస్తూ.. ఓ వైపు పిస్తోల్, మరోవైపు గన్ను పేలుస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు విజయ్.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోండగా..ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.