Leo | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) నటిస్తున్న తాజా చిత్రం లియో (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు స్టన్నింగ్ అప్డేట్ అందించారు. లియో ఫస్ట్ లుక్ లాంఛ్ చేశారు. విజయ్ సుత్తె పట్టుకొని యాక్షన్ మూడ్‌లో స్టిల్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. తాజా లుక్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తుంది.
మేకర్స్ ఇప్పటికే లియో నుంచి ఫస్ట్ సాంగ్ నా రెడీ సాంగ్ ప్రోమో (Naa Ready Song)ను విడుదల చేయగా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు లాంఛ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన లియో టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అక్టోబర్ 19న లియో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మిస్తున్నారు. లియోకు లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ సంభాషణలు సమకూరుస్తున్నారు. మాస్టర్ తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో లియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
You hear me now 💣
Leo Leo Leo Leo Leo Leo First Look 💥#LeoFirstLook 🔥#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @anirudhofficial @Jagadishbliss @trishtrashers @duttsanjay @akarjunofficial @immasterdinesh @SonyMusicSouth #LEO#HBDThalapathyVIJAY pic.twitter.com/njGSsNSQ8I
— Seven Screen Studio (@7screenstudio) June 21, 2023
Ungal #Vijay paadiya paadal 🎼#LeoFirstSingle is releasing Today at 6.30 PM 🔥#NaaReady #Thalapathy @actorvijay sir @Dir_Lokesh @anirudhofficial @Jagadishbliss @trishtrashers @duttsanjay @akarjunofficial @immasterdinesh @SonyMusicSouth #LEO#HBDThalapathyVIJAY pic.twitter.com/RnmMgUT5ta
— Seven Screen Studio (@7screenstudio) June 22, 2023
నా రెడీ సాంగ్ ప్రోమో..
లియో టైటిల్ ప్రోమో..