‘ప్రతి కామన్ ఆడియన్‌కు రీచ్ అయ్యే సబ్జక్ట్ ఇది. మన జీవితంలో ఎదురైన సందర్భాల్నీ, పాత్రల్నీ చూసిన ఫీల్ కలుగుతుంది. ఇందులో నా పాత్ర పేరు కార్తీక్. తానో ఇన్నోసెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. పోయిపోయి ఓ గయ్యాళి అమ్మాయిని ప్రేమిస్తాడు. భిన్న వ్యక్తిత్వాలున్న ఈ ప్రేమికుల బంధం ఎలా ముందుకు సాగింది? అనే ప్రశ్నకు సమాధానమే ఈ కథ’ అని యువహీరో విజయ్‌శంకర్ అన్నారు.
ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘పాగల్ వర్సెస్ కాదల్’. విషిక కథానాయిక. రాజేశ్ ముదునూరి దర్శకుడు. పడ్డాన మన్మథరావు నిర్మాత. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విజయ్‌శంకర్ మీడియాతో మాట్లాడారు.
“పాగల్ వర్సెస్ కాదల్’ అనే టైటిల్ ఈ కథకు పర్ఫెక్ట్ యాప్ట్. ఇందులో కొత్తరకం ప్రేమికుల్ని చూస్తారు. విషిక ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యేలా నటించింది. నటిస్తుందా? లేక బిహేవ్ చేస్తుందా? అనే అనుమానం కలిగేంత అద్భుతంగా నటించింది. దర్శకుడు రాజేశ్‌కు ఈ సినిమా తప్పకుండా పెద్ద బ్రేక్ అవుతుంది. సాంకేతికంగా సినిమా అభినందనీయంగా ఉంటుంది.’ అని విజయ్‌శంకర్ చెప్పారు.