Vijay Sethupathi – Nithya Menon | మక్కల్ సెల్వన్ నటుడు విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డు విన్నర్ నటి నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘తలైవన్ తలైవి’ (Thalaivan Thalaivii). తెలుగులో ఈ సినిమాను సార్‌మేడమ్ (SirMadam) పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించగా.. టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. అ చిత్రం తమిళంతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అనుకోని కారణాల వలన ఈ సినిమా తెలుగులో వాయిదా పడింది. తెలుగులో ఈ సినిమాను ఆగష్టు 01న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.
విజయ్ సేతుపతి, నిత్య మీనన్ ఇందులో భార్యభర్తలుగా నటించబోతున్నారు. పెళ్లి అయిన మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత ప్రతిదానికి చిరాకు, గొడవలు పడడం. ఈ వివాదాలు వారి వైవాహిక జీవితాన్ని వారి బిజినెస్‌ని ఎలా ప్రమాదంలో పడేస్తాయి అనేది ఈ సినిమా కథ.
#SirMadam in theatres from August 1! pic.twitter.com/JbxrE0TToT
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) July 26, 2025