ఇటీవలే బెంగళూరు ఎయిర్ పోర్టు (Bengaluru airport)లో కోలీవుడ్ (Kollywood) స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi)పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఎయిర్ పోర్టు సెక్యూరిటీ టీం భద్రతలో వెళ్తున్న విజయ్ సేతుపతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటనపై విజయ్ సేతుపతి స్పందించాడు.
హఠాత్తుగా దాడి జరగడం వెనుకున్న కారణమేంటని మీడియా ప్రశ్నించగా..ఇది చాలా చిన్న ఘటన. కానీ జనాలు దీన్ని చాలా పెద్దదిగా చేస్తున్నారన్నారు. దాడి చేసిన వ్యక్తి తాగిన మైకంలో ఉన్నాడు. జనాలు స్పృహలో లేనపుడు అసాధారణంగా ప్రవర్తిస్తుంటారు. అధికారులు అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. సమస్య పరిష్కారమైంది. కానీ ఈ రోజుల్లో ప్రతీ స్మార్ట్ ఫోన్ యూజర్ ఫిల్మ్ మేకర్ అయిపోయాడు అంటూ దాడి ఘటనపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు విజయ్ సేతుపతి.
మక్కల్ సెల్వన్ అని పిలిపించుకునే విజయ్ సేతుపతికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువనే సంగతి తెలిసిందే. ఊహించని విధంగా జరిగిన ఘటనతో ఒక్కసారిగా షాక్‌లో ఉండిపోయాడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం కాతువాకుల రెండు కాధల్ సినిమాతోపాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
దాడి ఘటన వీడియో..
Actor #VijaySethupathi attacked at Bengaluru airport. Initial reports say the incident happened yesterday night. More details awaited… pic.twitter.com/07RLSo97Iw
— Janardhan Koushik (@koushiktweets) November 3, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rana: ఒక్క పోస్ట్‌తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Kamal Hassan: తన బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కమల్ హాసన్
Pawan Kalyan: లాలా భీమ్లా సాంగ్ విడుదల.. పవన్ అభిమానులకి పూనకాలే..!