దేశంలో అతిపెద్దదైన లాజిస్టిక్స్ సంస్థ వీఆర్ఎల్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ విజయ్ శంకేశ్వర్ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘విజయానంద్’. రిషికాశర్మ దర్శకత్వంలో ఆనంద్ శంకేశ్వర్ నిర్మించారు. డిసెంబర్ 9న విడుదలకానుంది. ట్రైలర్‌ను ఇటీవల బెంగళూరులో విడుదల చేశారు. సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించిన శంకేశ్వర్ ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన వైనాన్ని ట్రైలర్లో చూపించారు. ఓ సామాన్యుడి స్ఫూర్తిదాయక ప్రయాణానికి దృశ్యరూపంలా ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను నిహాల్ రాజ్‌పుత్ పోషించారు. అనంత్‌నాగ్, సిరి ప్రహ్లాద్, భరత్ బోపన తదితరులు నటించారు.