Vijay- Rashmika | టాలీవుడ్ యూత్ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచే ప్రయత్నంలో ఉన్నాడు. ఈసారి అతను నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో కలిసి ఓ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. ‘టాక్సీవాలా’తో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను నిరూపించిన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ‘VD14’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ సాగుతుండగా, సోమవారం అధికారికంగా సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన విజయ్ ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది.
ఈ చిత్రానికి ‘రణబలి’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కథా నేపథ్యం, థీమ్‌కు ఈ పేరు పర్ఫెక్ట్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట. బ్రిటీష్ పాలన కాలాన్ని బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుని, 1854 నుంచి 1878 మధ్య జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ను ఇంతకు ముందు చూడని విధంగా ఓ డిఫరెంట్ పీరియాడికల్ పాత్రలో చూపించనున్నారని, ఈ సినిమా ఫ్యాన్స్ ఆకలి తీరేలా ఉంటుందని దర్శకుడు రాహుల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు హైప్‌ను మరింత పెంచాయి.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత విజయ్–రష్మిక జంట మూడోసారి తెరపై కనిపించనుండటంతో అభిమానులు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను హిట్‌గా ఫిక్స్ చేసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాతో పాటు, విజయ్ ప్రస్తుతం ‘రౌడీ జనార్దన’ వంటి ఇతర ప్రాజెక్టులతోనూ బిజీగా ఉండటం విశేషం. కొన్నాళ్లుగా విజయ్ దేవరకొండకి సరైన సక్సెస్ లేదు. మరి ఈ చిత్రాలలో ఏ మూవీ విజయ్‌కి లక్కీ మూవీగా మారుతుందో చూడాలి.