Leo | కోలీవుడ్ హీరో దళపతి విజయ్ (Vijay) నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ లియో (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ నా రెడీ సాంగ్ ప్రోమో (Naa Ready Song)ను లాంఛ్ చేయగా.. మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 22 (రేపు)న ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. తాజాగా లియో ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ అప్డేట్ అందించారు మేకర్స్.
విజయ్ బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. ఇవాళ మిడ్నైట్ 12 గంటలకు ఫస్ట్ లుక్ లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. లియో చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన లియో టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియో సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తూ.. అభిమానుల్లో జోష్ నింపుతోంది. లియో చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. లియో చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ సంభాషణలు సమకూరుస్తున్నారు. మాస్టర్ తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో లియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
#LeoFirstLook at 12AM for @actorvijay Anna’s Birthday#Leo 🔥🧊
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 21, 2023
నా రెడీ సాంగ్ ప్రోమో..
లియో టైటిల్ ప్రోమో..