Vijay |తమిళ సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించిన ఇళయ దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టే ముందు ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం “జన నాయగన్” ఇప్పుడు భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతోంది. మొదట ఈ సినిమా సాధారణ కమర్షియల్ ప్రాజెక్ట్‌లా కనిపించినా.. విజయ్ రాజకీయ ప్రయాణం, సీఎం పదవి చేపట్టడం తర్వాత ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. ఈ సినిమాకి మొదటి నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. షూటింగ్ ఆలస్యం, విడుదల తేదీల మార్పులు, రాజకీయ పరిణామాలు వంటి అనేక కారణాలతో చిత్రం పలుమార్లు వార్తల్లో నిలిచింది.
అయితే చివరకు ఈ సినిమా విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ప్రేక్షకుల ముందుకు రావడం ఇప్పుడు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. అందుకే అభిమానులు కూడా “ఇది సాధారణ సినిమా కాదు.. సీఎం విజయ్ హీరోగా కనిపించే చివరి చిత్రం” అంటూ సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ ఆలస్యమే మొదట చిత్ర బిజినెస్‌పై ప్రభావం చూపినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీ హక్కుల విషయంలో నిర్మాతలు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదని టాక్ వినిపించింది. ఒక దశలో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డీల్ నుంచి తప్పుకుందని ప్రచారం జరిగింది. సినిమా విడుదలపై స్పష్టత లేకపోవడం, రాజకీయ పరిణామాలు వేగంగా మారడం వంటి కారణాల వల్లే వారు వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెబుతున్నారు. విజయ్ ముఖ్యమంత్రి కావడంతో “జన నాయగన్”పై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. దీంతో గతంలో ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపని ఓటీటీ సంస్థలే ఇప్పుడు భారీ ఆఫర్లతో ముందుకొస్తున్నాయనే వార్తలు తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా మళ్లీ ఈ చిత్రం హక్కుల కోసం చర్చలు జరుపుతోందని సమాచారం. ఇక ప్రైమ్ వీడియో వెనక్కి తగ్గిన సమయంలో జీ5 సంస్థ ఈ రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాతలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో ఒప్పందం కుదుర్చుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.