‘యువర్ బాయ్ ఈజ్ బ్యాక్..వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే క్యాప్షన్‌తో అగ్ర హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్లో పెట్టిన ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందులో ఆయన ైస్టెలిష్ లుక్‌తో కనిపిస్తున్నారు. ఓ చేతిలో పేపర్, మరో చేతిలో కాఫీ కప్పుతో మైక్‌ముందు డబ్బింగ్ చెబుతున్నట్లుగా ఆ ఫొటోలో దర్శనమిస్తున్నారు. ఈ స్టిల్‌ను చూసిన వారు విజయ్‌దేవరకొండ ‘లైగర్’ సినిమా డబ్బింగ్ లేదా ప్రచార ప్రోమో కోసమో ఇంటి దగ్గరే డబ్బింగ్ చెబుతున్నాడని అంటున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ‘లైగర్’ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.