‘రణబాలి’లో అదే హైలైట్!
అగ్ర హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’ నిర్మాణం నుంచే భారీ హైప్‌ని క్రియేట్ చేస్తున్నది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. 19వ శతాబ్దం నాటి ఈ కథలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడే యోధుడిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు.
అగ్ర హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’ నిర్మాణం నుంచే భారీ హైప్‌ని క్రియేట్ చేస్తున్నది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. 19వ శతాబ్దం నాటి ఈ కథలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడే యోధుడిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు, ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ ప్రధాన ప్రతినాయకుడు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘అత్యంత క్రూరుడైన కరువు నేల రాక్షసుడు’ అనే క్యాప్షన్‌తో ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఇటీవలే ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ‘రణబాలి’ గురించి సోషల్‌మీడియా ద్వారా ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, ఆర్నాల్డ్ వోస్లూ మధ్య వచ్చే ైక్లెమాక్స్ ఘట్టాలు రోమాంచితంగా సాగుతాయని, దాదాపు 16 రోజుల పాటు ైక్లెమాక్స్ షూట్ జరిపామని చెప్పారు. ‘సినిమాకు గ్లోబల్ అప్పీల్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఆర్నాల్డ్ వోస్లూని విలన్‌గా తీసుకున్నాం. షూటింగ్ కోసం ఆయన ఆరు నెలల పాటు హైదరాబాద్‌లోనే ఉన్నారు. పతాక సన్నివేశాలను లార్జ్స్కేల్లో డిజైన్ చేశాం. సినిమాలో అవే హైలైట్‌గా నిలుస్తాయి’ అని రాహుల్ సాంకృత్యాన్ తెలిపారు. సెప్టెంబర్ 11న ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

