Vijay Devarakonda Kingdom | స్టార్ కథానాయకుడు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాను హిందీలో విడుదల చేయట్లేదని కొన్ని రోజులుగా రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రూమర్స్‌కి చెక్ పెడుతూ హిందీలో విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను హిందీలో కూడా జూలై 31న విడుదల చేయబోతుండగా.. టైటిల్ మాత్రం ఛేంజ్ చేశారు. కింగ్డమ్కి బదులుగా ఈ చిత్రం సామ్రాజ్య పేరుతో హిందీలో విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రయూనిట్ కొత్త పొస్టర్‌ను పంచుకుంది.
కింగ్డమ్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నది. సత్యదేవ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు.
VIJAY DEVERAKONDA’S NEXT PAN-INDIA FILM IS ‘KINGDOM’ – HINDI VERSION TITLED ‘SAAMRAJYA’ – 31 JULY 2025 RELEASE… #VijayDeverakonda returns to the big screen with #Kingdom, slated for a worldwide theatrical release on 31 July 2025… The #Hindi version is titled #Saamrajya.
The… pic.twitter.com/Xfa9mW8ZJ5
— taran adarsh (@taran_adarsh) July 19, 2025