బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Jan 24, 2020 , 23:25:47

మనసును మీటిన మై లవ్‌

మనసును మీటిన మై లవ్‌

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. క్రాంతిమాధవ్‌ దర్శకుడు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, ఐశ్వర్యారాజేష్‌, కేథరిన్‌, ఇజాబెల్లా కథానాయికలు. ఈ సినిమాలోని తొలి గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. ‘ఓ మై లవ్‌..మనసును మీటే..ఏదో తీయని పాటే..’ అంటూ సాగే పాటకు రెహమాన్‌ సాహిత్యాన్ని అందించగా, రమ్య బెహరా గానం చేశారు. గోపీసుందర్‌ సంగీతాన్నందించారు. నలుగురు నాయికలతో విజయ్‌ దేవరకొండ ప్రేమాయణానికి అద్దం పడుతూ ఈ గీతం ఆకట్టుకుంటున్నది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్రంలో విజయ్‌దేవరకొండ నాలుగు భిన్న పార్శాల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: క్రాంతిమాధవ్‌.

logo