Kushi | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖుషి (Kushi). నిన్ను కోరి, మజిలీ ఫేం శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత (Samantha) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే ఖుషి నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే(Na Rojaa Nuvve) అందరి ఇంప్రెస్ చేస్తుండగా.. ఇటీవలే మేకర్స్ రెండో సింగిల్ ఆరాధ్య (Aradhya Song) పాటను కూడా విడుదల చేశారు. శివనిర్వాణ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద పాడారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలువబోతుందడటంలో ఎలాంటి సందేహం లేదని విజయ్ దేవరకొండ కామెంట్స్‌తో అర్థమవుతోంది.
విజయ్ దేవరకొండ తాజాగా ఈ ట్రాక్ గురించి మాట్లాడాడు. ప్రేమలో ఉన్న యువతీయువకులు పెళ్లి చేసుకుంటారు. ఏడాది తర్వాత వారి మధ్య ఉండే ఆత్మీయత.. ఇద్దరి మధ్య ఉండే ఏర్పడే బంధం, వారి అద్భుతమైన ప్రయాణం నేపథ్యంలోని ఫీల్ అందించేలా ఈ పాట ఉంటుందని చెప్పాడు విజయ్ దేవరకొండ. శివనిర్వాణ, మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్దుల్ అద్భుతమైన పాట ఇచ్చారు. నాకింకా పెండ్లి కాలేదు. పెళ్లయ్యాక నా లైఫ్ ఈ ప్రయాణంలా ఉండాలనుకుంటున్నా. సిద్ శ్రీరామ్ నా కోసం మళ్లీ పాడాడు. నా సినిమాలతో ప్రేమలో పడేంతలా సిద్ శ్రీరామ్ వాయిస్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ఖుషి చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 1న సినిమా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌ను కూడా లాంఛ్ చేశారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆరాధ్య సాంగ్..
ఆరాధ్య సాంగ్‌పై విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే..?
నా రోజా నువ్వే..