ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 11, 2020 , 10:47:26

రాజ‌కీయాల‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాజ‌కీయాల‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలీవుడ్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా దేశంలో రాజకీయ విధానాలు, ఓటు హక్కు లాంటి అంశాలపై త‌న వాద‌న‌ను వినిపించాడు. ఓటు హక్కు  పేద వాళ్లకు, డబ్బున్న వాళ్లకు ఉండకూడదని, కేవలం మధ్య తరగతి వారికి మాత్రమే ఉండాల‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డంతో ప్ర‌స్తుతం ఈ టాపిక్  సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్రదుమారం రేపుతుంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ.. నాకు రాజ‌కీయాలు చేసే అంత ఓపిక లేదు. మ‌న దేశంలో రాజ‌కీయ వ్య‌వ‌స్థ అర్ధం ప‌ర్ధం లేకండా ఉంది. ఓ వైపు ఓటర్లు డబ్బుకు, లిక్కర్‌కు అమ్ముడుపోవడం మరోవైపు రాజకీయ నాయకులు మందు, డబ్బుతో ఓటర్లను కొనడం అన్నీ సర్వసాధారణం అయిపోయాయి. ఇలా లిక్కర్ తీసుకుని ఓటు వేసే వారికి ఓటు హక్కు ఉండకూడదంటూ ఎన్నికల సమయంలో ఏరులై పారుతున్న నగదు ప్రవాహంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను వెంటనే ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని విజయ్ దేవరకొండ అన్నారు. డబ్బు కోసం ఓటు అమ్ముకునే వారికి ఓటుకు ఉన్న విలువ తెలియదని, అలాంటి వారికి ఓటు హక్కును తొలగించడమే సరైన చర్య అని విజయ్ పేర్కొన్నారు

ఓ విమానం నడిపే పైలట్‌ని అందులో ఎక్కే 300 మంది ప్రయాణికులు ఓట్లు వేసి ఎన్నుకోరు కదా! అలాగే సమాజాన్ని నడిపే బాధ్యతను కూడా సమాజంపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడి చేతిలో పెట్టాలి అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం విజ‌య్ మాట‌లు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.


logo