Vijay Deverakonda | హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా అభిమానులకు వినోదాన్ని అందించడమే టార్గెట్‌గా ముందుకెళ్తున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). రౌడీ బాయ్ ఇటీవలే అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA)ఉమెన్స్ ఫోరం ఈవెంట్‌కు హాజరయ్యాడని తెలిసిందే. అక్కడి తెలుగు మహిళలు విజయ్ దేవరకొండకు ఘనంగా స్వాగతం పలికిన వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా విజయ్ దేవరకొండ అట్లాంటాలో జరుగుతున్న 18వ ATA Convention and Youth Conference కోసం ప్రత్యేకంగా రెడీ అయ్యాడు. సంప్రదాయ, మోడ్రన్ అవతార్‌లో కింగ్ లుక్‌లో మెరిసిపోతూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
లైగర్ భారీ డిజాస్టర్ తర్వాత సినిమాల ఎంపికలో రూటు మార్చిన విజయ్ దేవరకొండ శివనిర్వాణ డైరెక్షన్లో నటించిన ఖుషి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఇక ఇటీవలే పరశురాం డైరెక్షన్లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఢీలా పడిపోయింది. ప్రస్తుతం VD12, VD13, VD14 సినిమాలతో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కాప్ డ్రామా VD12 షూటింగ్ దశలో ఉంది.
.@TheDeverakonda latest from the 18th ATA Convention and Youth Conference at Atlanta, USA.#VijayDeverakonda pic.twitter.com/xPlAr02aSb
— Vamsi Kaka (@vamsikaka) June 14, 2024
DEVERAAAAAA 🔥🔥🔥🔥 pic.twitter.com/jUCFp7IbW9
— The Chanti (@chanticomrade_) June 14, 2024