Kingdom Movie | విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ కింగ్డమ్. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ని మేకర్స్ అందించారు. ఈ మూవీ రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం ఈ మూవీ మే 30న విడుదల కావాల్సింది. ఈ మూవీని జులై 4న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. కింగ్డమ్ మూవీని మే 30న విడుదల చేయాలని ఎంతో ప్రయత్నించామని.. కానీ, ఇటీవల దేశంలో ఊహించని ఘటనలు జరిగాయని పేర్కొంది.
దేశంలోని వాతావరణం కారణంగా, ప్రమోషన్లు కష్టంగా మారాయని.. ఈవెంట్స్ నిర్వహించడం సరికాదని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. జులై 4న మూవీని విడుదల చేస్తామని సితార ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. మూవీ ఆలస్యంగా వచ్చినా అభిమానుల ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా ఉంటుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే విడుదలైన మూవీకి స్పందించిన స్పెషల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. దాంతో మూవీనిపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నది. సత్యదేవ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ను హైదరాబాద్, విశాఖపట్నం, కేరళ, శ్రీలంకలో చిత్రీకరించినట్లు సమాచారం.
#KINGDOM and its Arrival ‼️
JULY 04th, 2025 🔥@TheDeverakonda @anirudhofficial @gowtam19 #BhagyashriBorse @dopjomon #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @artkolla @NeerajaKona @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios @AdityaMusic pic.twitter.com/ASQbpCJUs9— Sithara Entertainments (@SitharaEnts) May 14, 2025