అభిమానులను హాలీడే ట్రిప్‌నకు తీసుకెళ్తానంటూ ప్రకటించారు హీరో విజయ్ దేవరకొండ. ఏటా ఆయన దేవరశాంటా పేరుతో అభిమానులకు బహుమతులు ఇస్తుంటారు. గత రెండేండ్లు వంద మంది అభిమానులను ఎంపికచేసి ఇలా గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ సారి తన అభిమానులను హాలీడే వెకేషన్‌కు తీసుకెళ్లనున్నట్లు తాజాగా విజయ్ ప్రకటించారు. ఈ పర్యటనలో అయ్యే అన్ని ఖర్చులు తానే భరిస్తానని తాజా సోషల్ మీడియా పోస్టులో విజయ్ దేవరకొండ ప్రకటించారు. మన దేశంలో ఎక్కడికి తీసుకెళ్లాలి అంటూ నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. పర్వత ప్రాంతాలు, బీచ్‌లు, సాంస్కృతికంగా ప్రసిద్ధి చెందినవి, ఏడారి ప్రాంతాలు..వీటిలో ఏదైనా ఎంచుకోవాలంటూ సూచించారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్లో ఉంది.