‘కల్కి 2898’ సినిమాలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడా? వాతావరణం అవుననే చెబుతున్నది. ‘కల్కి’ పురాణాలతో మిళితమైన ఫిక్షన్ సినిమా. ఆరువేల సంవత్సరాల క్రితం జరిగిన కురుక్షేత్ర సంగ్రామానికి అశ్వత్థామ వృత్తాంతానికి ఈ కథకు సంబంధం ఉందని ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలే చెబుతున్నాయి.
వృద్ధుడైన ద్రోణసుతుడు అశ్వత్థామను చూసిస్తూనే, యువకుడైన అశ్వత్థామను కూడా టీజర్లో చూపించారు దర్శకడు. కాబట్టి కచ్చితంగా ఆరు వేల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఇందులో చూపించే అవకాశం ఉంది. అశ్వత్థామ వృత్తాంతంలో కృష్ణార్జునుల పాత్రలు చాలా కీలకం కాబట్టి అర్జునుడి పాత్రను విజయ్ దేవరకొండతో చేయించడం జరిగిందనేది ఫిల్మ్వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరి ‘కల్కి’గా కనిపించనున్న ప్రభాసే.. కృష్ణుడిగా కూడా కనిపిస్తారా? అనేది తెలియాల్సివుంది.