Family Star | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) , పరశురాం (Parasuram) డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం VD13. ఈ మూవీకి ఫ్యామిలీ స్టార్ (Family Star) టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం టైటిల్ లుక్ ఫ్యామిలీ స్టార్‌ను షేర్ చేస్తూ.. గ్లింప్స్ వీడియోను లాంఛ్ చేశారు.
లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడం.. టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా.. సెటిల్మెంట్ అంటే..? అంటే అని అజయ్ ఘోష్ అంటుంటే.. భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఏ ఉల్లిపాయలు లైన్లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా..పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటీ.. కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా అంటూ విజయ్ దేవరకొండ తనదైన స్టైల్లో చెబుతున్న మాస్ డైలాగ్స్ అదిరిపోయాయి. గీతగోవిందం తర్వాత విజయ్ దేవరకొండతో మరో హిట్టు గ్యారంటీ అని చెప్పకనే చెబుతున్నాడు పరశురాం.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ బ్యానర్‌కు ఇది 54వ ప్రాజెక్ట్. విజయ్ దేవరకొండ మరోవైపు జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో VD12 చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.
ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్..
VD 13 లాంఛింగ్ స్టిల్స్..
The much awaited collaboration of THE #VijayDeverakonda, @parasurampetla, & @svc_official’s #VD13 is officially launched today.
The talented @mrunal0801 joins the stellar cast.
Shoot begins soon.#SVC54@Thedeverakonda#KUMohanan @GopiSundarOffl #VasuVarma #DilRaju #Shirish pic.twitter.com/ZzOfigIvme
— Sri Venkateswara Creations (@SVC_official) June 14, 2023
The shoot of our #VD13 #SVC54 kick started today!🤩
Promising you a perfect entertainer for Sankranthi 2024.❤️🔥@TheDeverakonda #MrunalThakur @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/wEBkpqDROv
— Sri Venkateswara Creations (@SVC_official) July 15, 2023