Vijay Deverakonda | అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవర కొండ (Vijay Deverakonda). ఈ క్రేజీ యాక్టర్ అభిమానుల్లో సెలెబ్రిటీలు కూడా ఉన్నారంటే ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది ఫీ మేల్ సెలబ్రిటీలు విజయ్‌పై క్రష్ ఉందని చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు. చివరగా లైగర్ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చి బిగ్గెస్ట్ ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. లైగర్ డిజాస్టర్ టాక్ ఎలా ఉన్నప్పటికీ ఈ రౌడీ బాయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
తాజాగా ఒలంపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) చేసిన కామెంట్సే ఈ టాపిక్ తెరపైకి రావడానికి కారణం. తాజా ఇంటర్వ్యూలో యాంకర్ నీరజ్ చోప్రాను మీరు ఎవరి ఫ్యాషన్ సెన్స్‌ను ఎక్కువగా లైక్ చేస్తారని అడిగారు. దానికి వెంటనే విజయ్ దేవరకొండ ఫ్యాషన్ సెన్స్ అంటే తనకిష్టమని చెప్పాడు నీరజ్ చోప్రా. విజయ్ దేవరకొండ స్టైల్‌ను ఇష్టపడని వారెవరూ ఉండరని చెప్పేందుకు ఈ ఒక్క కామెంట్ చాలు.
విజయ్ దేవర కొండ ప్రస్తుతం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఖుషి (Kushi)లో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. చెన్నై సుందరి సమంత ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో కాప్ డ్రామా నేపథ్యంలో VD 12 సినిమా కూడా చేస్తున్నాడు.