Vijay Deverakonda | న్యూయార్క్‌లో విజయ్ దేవరకొండ కాఫీ టైం.. షూటింగ్ కోసమేనా..?
Vijay Deverakonda | రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖుషి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని మళ్లీ ట్రాక్‌పైకి వచ్చాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రస్తుతం గీత గోవిందం ఫేం పరశురాం డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్‌లో నటిస్తున్నాడని తెలిసిందే. VD13 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీలో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తోంది.
Vijay Deverakonda | లైగర్ ఫెయిల్యూర్ తర్వాత సినిమాల ఎంపికలో రూటు మార్చేశాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఆ తర్వాత వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖుషి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని మళ్లీ ట్రాక్‌పైకి వచ్చాడు. ప్రస్తుతం గీత గోవిందం ఫేం పరశురాం డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్‌లో నటిస్తున్నాడని తెలిసిందే. VD13 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీలో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తోంది.
ఇటీవలే ఆరెంజ్ షర్ట్, కార్గో ప్యాంట్‌తో ఉన్న రౌడీవేర్ లుక్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. షూటింగ్‌తో బిజీగా ఉన్న అర్జున్ రెడ్డి యాక్టర్ సరదాగా న్యూయార్క్‌లోని కేఫ్‌కు వెళ్లాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ఉన్న విజయ్ దేవరకొండ కాఫీ తాగుతున్న స్టిల్‌తోపాటు అభిమానులతో దిగిన సెల్ఫీ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. క్లీన్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్న విజయ్ కేఫ్‌కు ఒక్కడే వెళ్లాడా..? పక్కనే ఇంకెవరైనా ఉన్నారా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
విజయ్ దేవరకొండను ఫ్యామిలీ మ్యాన్‌లో నయా లుక్‌లో చూపించేందుకు రెడీ అయినట్టు ఫ్యామిలీ స్టార్ టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడం.. టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా.. సెటిల్మెంట్ అంటే..? అంటే అని అజయ్ ఘోష్ అంటుంటే.. భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఏ ఉల్లిపాయలు లైన్లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా..పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటీ.. కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా అని టీజర్లో విజయ్ దేవరకొండ క్లాస్ లుక్‌లో చెబుతున్న మాస్ డైలాగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ దీంతోపాటు జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో VD12లో కూడా నటిస్తున్నాడు. కాప్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తన్నాయి. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
విజయ్ దేవరకొండ కాఫీ టైం..
Vijay Deverakonda spotted having coffee in NY.😍 #VijayDeverakonda @TheDeverakonda pic.twitter.com/26fvzUs1NE
— Sreenivas Gandla (@SreenivasPRO) December 21, 2023
ట్రెండింగ్‌లో విజయ్ దేవరకొండ నయా స్టిల్స్..
Stylish clicks of @TheDeverakonda ❤️🔥#VijayDeverakondapic.twitter.com/3mdXrh9RIX
— Suresh PRO (@SureshPRO_) October 29, 2023
ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్..
VD 13 లాంఛింగ్ స్టిల్స్..
The much awaited collaboration of THE #VijayDeverakonda, @parasurampetla, & @svc_official’s #VD13 is officially launched today.
The talented @mrunal0801 joins the stellar cast.
Shoot begins soon.#SVC54@Thedeverakonda#KUMohanan @GopiSundarOffl #VasuVarma #DilRaju #Shirish pic.twitter.com/ZzOfigIvme
— Sri Venkateswara Creations (@SVC_official) June 14, 2023
The shoot of our #VD13 #SVC54 kick started today!🤩
Promising you a perfect entertainer for Sankranthi 2024.❤️🔥@TheDeverakonda #MrunalThakur @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/wEBkpqDROv
— Sri Venkateswara Creations (@SVC_official) July 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

