అగ్ర హీరో విజయ్ దేవరకొండ మంచి కథల్ని ఎంచుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆయన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. రీసెంట్గా ‘రౌడీ జనార్దన్’ సినిమా ఓపెనింగ్ అయ్యింది. రవికిరణ్ కోలా దర్శకుడు.
ఇదిలావుంటే.. తాజాగా మరో దర్శకుడి కథను విజయ్ ఓకే చేశారు. ఆయనే విక్రమ్ కె.కుమార్. ఇష్క్, 24, మనం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన విక్రమ్ ఇటీవలే విజయ్‌కు కథ వినిపించారట. విజయ్‌కు కూడా కథ బాగా నచ్చిందట. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు
తెలియాల్సివుంది.